Thu Mar 19 2026 14:22:47 GMT+0530 (India Standard Time)
ఏపీలో కరోనా మరణాలు 12.. కేసులు మాత్రం తగ్గుదల
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 12,561 కొత్త కేసులు నమోదయ్యాయి

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 12,561 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా పన్నెండు మంది మరణించారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 22,48,608 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,591 మంది మరణించారు.
యాక్టివ్ కేసులు....
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 21,12,0717 గా ఉంది. 1,13,300 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,23,65,775 నమూనాలను పరీక్షించారు.ఈరోజు కూడా అత్యధికంగా వైఎస్సార్ కడప జిల్లాలో 1,215 కరోనా కేసులు నమోదయ్యాయి.
Next Story

