Sun Feb 01 2026 21:34:53 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీని వీడుతున్న కరోనా... ఈరోజు ఎన్నికేసులంటే?
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 749 కొత్త కేసులు నమోదయ్యాయి

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 749 కొత్త కేసులు నమోదయ్యాయి. రెండు రోజుల నుంచి వెయ్యికి తక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఈరోజు కరోనా కారణంగా ముగ్గురు మరణించారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 23,12,778 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,697 మంది మరణించారు.
తూర్పు గోదావరి జిల్లాలో..
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 22,79,152 గా ఉంది. 18,929 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,28,31,785 నమూనాలను పరీక్షించారు. ఈరోజు అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక్కడ 125 కేసులు నమోదయ్యాయి.
Next Story

