Thu Mar 19 2026 06:27:34 GMT+0530 (India Standard Time)
ఏపీలో కరోనా అప్ డేట్
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 425 కొత్త కేసులు నమోదయ్యాయి

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 425 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ఇద్దరు మరణించారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 23,15,950 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,710 మంది మరణించారు.
యాక్టివ్ కేసులు...
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 22,93,882 గా ఉంది. యాక్టివ్ కేసులు బాగా తగ్గుతున్నాయి. 7,358 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,29,58,399 నమూనాలను పరీక్షించారు. ఈరోజు అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక్కడ 113 కేసులు నమోదయ్యాయి.
Next Story

