Thu Mar 19 2026 07:58:34 GMT+0530 (India Standard Time)
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 1,166 కొత్త కేసులు నమోదయ్యాయి

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 1,166 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ఐదుగురు మరణించారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 23,11,133 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,688 మంది మరణించారు.
తూర్పు గోదావరి జిల్లాలో..
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 22,64,032 గా ఉంది. 32,413 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,27,84,934 నమూనాలను పరీక్షించారు. ఈరోజు అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక్కడ 256 కేసులు నమోదయ్యాయి.
Next Story

