Sun Feb 01 2026 20:02:31 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ లో కరోనా అప్ డేట్
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు బాగా తగ్గాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 615 కొత్త కేసులు నమోదయ్యాయి

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు బాగా తగ్గాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 615 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా నలుగురు మరణించారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 23,13,827 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,702 మంది మరణించారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో...
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 22,86,575 గా ఉంది. యాక్టివ్ కేసులు బాగా తగ్గుతున్నాయి. 12,550 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,28,69,245 నమూనాలను పరీక్షించారు. ఈరోజు అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక్కడ 134 కేసులు నమోదయ్యాయి.
Next Story

