Mon Feb 02 2026 00:24:03 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో నేడు కరోనాతో 9 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు చాలా తగ్గాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 3,396 కొత్త కేసులు నమోదయ్యాయి

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు చాలా తగ్గాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 3,396 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా తొమ్మిది మంది మరణించారు. మరణాలు ఎక్కువ సంఖ్యలో నమోదు అవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 23,00,765 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,655 మంది మరణించారు.
కృష్ణా జిల్లాలో....
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 22,07,364 గా ఉంది. 78,746 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,26,32,089 నమూనాలను పరీక్షించారు. ఈరోజు అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక్కడ 516 కేసులు నమోదయ్యాయి.
Next Story

