Thu Mar 19 2026 09:26:40 GMT+0530 (India Standard Time)
కేసులు బాగా తగ్గాయ్... మరణాలే...?
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు చాలా తగ్గాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 1,597 కొత్త కేసులు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు చాలా తగ్గాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 1,597 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ఎనిమిది మంది మరణించారు. మరణాలు ఎక్కువ సంఖ్యలో నమోదు అవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 23,05,052 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,672 మంది మరణించారు.
తూర్పు గోదావరి జిల్లాలో....
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 2227,985 గా ఉంది. 62,395 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,26,79,288 నమూనాలను పరీక్షించారు. ఈరోజు అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక్కడ 478 కేసులు నమోదయ్యాయి.
Next Story

