Sun Feb 01 2026 22:58:57 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 1,345 కొత్త కేసులు నమోదయ్యాయి

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 1,345 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా నలుగురు మరణించారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 23,09,967 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,683 మంది మరణించారు.
యాక్టివ్ కేసుల సంఖ్య..
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 22,54,400 గా ఉంది. 40,884 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,27,59,439 నమూనాలను పరీక్షించారు. ఈరోజు అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక్కడ 309 కేసులు నమోదయ్యాయి.
Next Story

