Thu Mar 19 2026 16:06:05 GMT+0530 (India Standard Time)
ఏపీలో ఏమాత్రం తగ్గని కరోనా.. ఏడుగురు మృతులు
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈరోజు కూడా భారీ సంఖ్యలో నమోదయ్యాయి

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈరోజు కూడా భారీ సంఖ్యలో నమోదయ్యాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 14,502 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ఏడుగురు మరణించారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 21,95,136 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,549 మంది మరణించారు.
యాక్టివ్ కేసులు....
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 20, 87, 282 గా ఉంది. 93,305 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,21,87,297 నమూనాలను పరీక్షించారు.ఈరోజు కూడా అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 1,728 కరోనా కేసులు నమోదయ్యాయి.
Next Story

