Thu Mar 19 2026 16:05:35 GMT+0530 (India Standard Time)
ఏపీలో కరోనా మోత.. పన్నెండు మంది మృతి
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 13,819 కొత్త కేసులు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 13,819 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా పన్నెండు మంది మరణించారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 22,08,955 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,561 మంది మరణించారు.
యాక్టివ్ కేసులు....
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 20, 92, 998 గా ఉంది. 1,01,396 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,22,34,226 నమూనాలను పరీక్షించారు.ఈరోజు కూడా అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 1,988 కరోనా కేసులు నమోదయ్యాయి.
Next Story

