Thu Mar 19 2026 14:23:32 GMT+0530 (India Standard Time)
ఏపీలో ఏ మాత్రం తగ్గని కరోనా.. మరణాలు కూడా?
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. ఈరోజు కొత్తగా ఏపీలో 13,474కొత్త కేసులు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. ఈరోజు కొత్తగా ఏపీలో 13,474కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ఎనిమిది మంది మరణించారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 22,36,047 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,579 మంది మరణించారు.
లక్ష దాటిన యాక్టివ్ కేసులు....
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 21, 11,975 గా ఉంది. 1,09,493 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,23,25,140 నమూనాలను పరీక్షించారు.ఈరోజు కూడా అత్యధికంగా కర్నూలు జిల్లాలో 1,835 కరోనా కేసులు నమోదయ్యాయి.
Next Story

