Thu Mar 19 2026 09:41:29 GMT+0530 (India Standard Time)
ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు రోజురోజుకూ బాగా పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 1,831 కొత్త కేసులు నమోదయ్యాయి

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు రోజురోజుకూ బాగా పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 1,831 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 20,84,674 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,500 మంది మరణించారు.
యాక్టివ్ కేసులు....
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 20,62,974 గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గాయి. 7,195యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,15,92,070 నమూనాలను పరీక్షించారు
Next Story

