Thu Mar 19 2026 14:24:03 GMT+0530 (India Standard Time)
ఏపీలో బాగా తగ్గిన కోరోనా... పెరిగిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు బాగా తగ్గుతున్నాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 10,310 కొత్త కేసులు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు బాగా తగ్గుతున్నాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 10,310 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా పన్నెండు మంది మరణించారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 22,70,491 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,606 మంది మరణించారు.
లక్ష దాటిన యాక్టివ్ కేసులు....
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 21,39,854 గా ఉంది. 1,16,031 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,24,45,428 నమూనాలను పరీక్షించారు.ఈరోజు కూడా అత్యధికంగా కర్నూలు జిల్లాలో 1,379 కరోనా కేసులు నమోదయ్యాయి
Next Story

