Thu Mar 19 2026 13:03:55 GMT+0530 (India Standard Time)
Ys Sharmila : నేటి నుంచి షర్మిల రచ్చబండ
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేటి నుంచి జిల్లాల పర్యటన చేయనున్నారు

Ys Sharmila :ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేటి నుంచి జిల్లాల పర్యటన చేయనున్నారు. ఈరోజు నుంచి పదకొండో తేదీ వరకూ ఆమె పర్యటనలు ఉండనున్నాయి. ఈరోజు సాయంత్రం 7 గంటలకు బాపట్ల నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో వైఎస్ షర్మిల పాల్గొంటారు. ఈ నెల 9వ తేదీన ఉదయం పది గంటలకు కొవ్వూరు నియోజకవర్గంలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో వైఎస్ షర్మిల పాల్గొననున్నారు.
వరస కార్యక్రమాలతో...
ఈనెల 9వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు తుని నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. పదో తేదీన ఉదయం నర్సీపట్నం నియోజకవర్గంలోనూ, సాయంత్రం పాడేరు నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఈ నెల 11న సాయంత్రం ఐదు గంటలకు నగిరి నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story

