Thu Mar 19 2026 19:59:00 GMT+0530 (India Standard Time)
Ys Jagan : నేడు వామపక్షాలతో షర్మిల భేటీ
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు సీపీఎం, సీపీఐ నేతలను కలవనున్నారు. పొత్తులపై చర్చించనున్నారు

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు సీపీఎం, సీపీఐ నేతలను కలవనున్నారు. రానున్న ఎన్నికల్లో పొత్తులపై వారితో చర్చించనున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఒక కూటమిగా ఏర్పడి పోటీ చేయడంతో వామపక్ష పార్టీలను కలసి కూటమిగా ఏర్పడాలని వైఎస్ షర్మిల కోరనున్నారు. వైసీపీ ఓటమే లక్ష్యంగా అందరూ కలవాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పనున్నారు.
మహాకూటమిలో...
రేపు ఉదయం తొమ్మిది గంటలకు సీపీఐ కార్యాలయంలో వైఎస్ షర్మిలతో సీపీఐ, సీపీఎం నేతలు భేటీ కానున్నారు. ఇప్పటికే ఇండియా కూటమిలో వామపక్ష పార్టీలు ఉండటంతో ఇక్కడ కూడా కలసి పోటీ చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు సీట్లు, సర్దుబాట్లు, ఉమ్మడి మ్యానిఫేస్టోపై కూడా షర్మిల వారితో చర్చించనున్నారు.
Next Story

