Fri Dec 05 2025 22:44:21 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : నేడు బెజవాడలో షర్మిల పర్యటన
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు విజయవాడ రానున్నారు. వరద పీడిత ప్రాంతల్లో పర్యటించనున్నారు

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు విజయవాడ రానున్నారు. ఉదయం ఆంధ్రరత్న భవన్ కు వచ్చి అక్కడి నుంచి ఆమె విజయవాడలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. విజయవాడలో వరద ముంపునకు గురైన సింగ్ నగర్ ప్రాంతాల్లో వైఎస్ షర్మిల పర్యటించనున్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.
బాధితులకు పరామర్శ...
అక్కడకు వెళ్లి బాధితులను పరామర్శిస్తారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సాయంపై వైఎస్ షర్మిల బాధితులను అడిగి తెలుసుకుంటారు. గత నాలుగు రోజుల నుంచి వరదల్లోనే చిక్కుకు పోయిన కుటుంబాలకు ప్రభుత్వం అందించిన సహకారంపై షర్మిల ఆరా తీస్తారు. బాధితులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. షర్మిల వెంట స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొనననున్నారు.
Next Story

