Sun Mar 15 2026 16:05:12 GMT+0530 (India Standard Time)
Ys Sharmila : దీక్షకు దిగిన షర్మిల... ఆంధ్రరత్న భవన్ వద్ద పోలీసుల మొహరింపు
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆంధ్రరత్న భవన్ లో దీక్షకు దిగారు.

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దీక్షకు దిగారు. ఆంధ్రరత్న భవన్ నుంచి ఆమెను పోలీసులు బయటకు రానివ్వక పోవడంతో ఆమె దీక్షకు దిగారు. డీఎస్సీ నోటిఫికేషన్ ను రద్దు చేసి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేయాలంటూ వైఎస్ షర్మిల ఆందోళనకు పిలుపు నిచ్చారు. చలో సెక్రటేరియట్ కు ఆమె కాల్ ఇచ్చారు. దీంతో నిన్నటి నుంచే కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్లు చేస్తున్నారు. రాత్రికి షర్మిల ఆంధ్రరత్న భవన్లోనే నిద్రచేశారు.
షర్మిలను బయటకు రానివ్వకుండా...
అయితే షర్మిలను బయటకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటుండటంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. కాంగ్రెస్ నేతలు వచ్చిన వారిని వచ్చినట్లు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో ఆంధ్రరత్న భవన్ వద్ద బ్యారికేడ్లు నిర్మించారు. పోలీసులు ఎవరినీ అటువైపు రానివ్వడం లేదు. వైఎస్ షర్మిల ఆంధ్రరత్న భవన్ లో దీక్షకు దిగారని తెలియడంతో అటువైపు దూసుకు వచ్చే కాంగ్రెస్ కార్యకర్తలను అదుపు చేస్తున్నారు.
Next Story

