Sun Mar 08 2026 15:09:07 GMT+0530 (India Standard Time)
Ys Sharmila : నేడు గవర్నర్ వద్దకు వైఎస్ షర్మిల
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు. ఆమె రాష్ట్ర రాజకీయాలపై చర్చించనున్నారు. ప్రధానంగా అదానీతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంపై ఈ ప్రభుత్వం విచారణ జరపాలని కోరనున్నారు. అదానీ, జగన్ ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందాలపై ఈ ప్రభుత్వం సీరియస్ గా విచారించాలని, అందుకు అవసరమైన ఆదేశాలను జారీ చేయాలని కోరనున్నారు.
అదానీ, జగన్ అంశంపై...
నిన్న ఇదే అంశాన్ని తెలుపుతూ విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన ఆంధ్రరత్న భవన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకూ విజయవాడలో వైఎస్ షర్మిల పార్టీ నేతలతో కలసి పాదయాత్ర చేసిన నేపథ్యంలో నేడు ఇదే అంశంపై గవర్నర్ ను కలవనున్నారు.దీంతో పాటు సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కూడా గవర్నర్ ను వైఎస్ షర్మిల కోరనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు వైఎస్ షర్మిల అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు.
Next Story

