Mon Mar 16 2026 14:27:28 GMT+0530 (India Standard Time)
Ys Sharmila : వైఎస్ పేరు ఛార్జిషీట్లో చేర్చింది జగనే.. షర్మిల సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును సీబీఐ ఛార్జ్ షీట్ లో చెర్పించింది కాంగ్రెస్ కాదని ఆమె అన్నారు. ఛార్జిషీట్ లో చేర్పించింది ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంటూ సంచలన షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగింది.
కేసుల నుంచి బయటపడేందుకు...
తాను కేసుల నుంచి బయట పడేందుకు జగన్ కావాలని పిటీషన్ వేయించారంటూ వైఎస్ షర్మిల రెడ్డి ఆరోపించారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డితో హైకోర్టు లో పిటీషన్ వేయించిందే జగన్ రెడ్డి అని వైఎస్ షర్మిల అన్నారు. అదే పోన్నవోలు కి ఇప్పుడు అడ్వకేట్ జనరల్ పదవి ఇచ్చారని అన్నారు. వైఎస్ పై సీబీఐ ఛార్జ్ షీట్ లో కాంగ్రెస్ పాత్ర లేనే లేదని వైఎస్ షర్మిల అన్నారు.
Next Story

