Fri Jan 24 2025 06:09:33 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : నేడు అనంతపురం జిల్లాలో షర్మిల
నేడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పర్యటించనున్నారు
నేడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కడప జిల్లా నుంచి వైఎస్ షర్మిల న్యాయయాత్ర పేరిట ప్రచారాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తన సోదరుడు వైసీపీ అధినేత జగన్ పార్టీని ఓడించే లక్ష్యంతో ఆమె పర్యటనలు సాగుతున్నాయి.
మూడు నియోజకవర్గాల్లో...
ఎన్నికల ప్రచారంలో జగన్ ను నేరుగా లక్ష్యంగా చేసుకుని ఆమె చేస్తున్న ప్రసంగాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ఈ రోజు ఉదయం 10 గంటలకు మడకశిర నియోజక వర్గంలో బహిరంగ సభలో వైఎస్ షర్మిల పాల్గొననన్నారు. సాయంత్రం 4 గంటలకు శింగనమల నియోజక వర్గంలో జరగనున్న సభ లో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు ఉరవకొండ నియోజక వర్గంలో పర్యటించనున్నారు.
Next Story