Mon Mar 16 2026 14:27:56 GMT+0530 (India Standard Time)
Ys Sharmila : నేడు కడప జిల్లాలో వైఎస్ షర్మిల
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. కడప జిల్లాలోని పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు నియోజకవర్గంలో ఆమె పర్యటన సాగనుంది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా వైఎస్ షర్మిల ప్రచారం ముమ్మరంగా చేయనున్నారు.
కడప జిల్లాలోనే...
న్యాయయాత్ర పేరిట గత కొద్దిరోజులుగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను పర్యటించిన షర్మిల వారం రోజుల పాటు కడప పార్లమెంటు పరిధిలోనే పర్యటించాలని నిర్ణయించారు. కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తాను పోటీ చేస్తుండటంతో షర్మిల ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. గెలుపే లక్ష్యంగా ఆమె పర్యటన సాగనుంది. ఈరోజు ఉదయం వడ్డమాను గ్రామం నుంచి షర్మిల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.
Next Story

