Mon Mar 16 2026 14:28:22 GMT+0530 (India Standard Time)
Ys Sharmila : నేటి నుంచి కడప జిల్లాలోనే వైఎస్ షర్మిల
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నేటి నుంచి కడప జిల్లాలో పర్యటించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నేటి నుంచి కడప జిల్లాలో పర్యటించనున్నారు. కడప పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలలో షర్మిల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. కడప పార్లమెంటు సభ్యురాలిగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న నేపథ్యంలో నేటి నుంచి వరసగా కడప పార్లమెంటు పరిధిలో పర్యటించాలని నిర్ణయించారు.
ఏడు నియోజకవర్గాల్లో...
ఉదయం బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని కాశినాయన, కలసపాడు, పోరుమామిళ్ల, బి. కోడూరు, బద్వేల్, అట్లూరు మండలాల్లో వైఎస్ షర్మిల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తూ తనను కూడా ఈ ఎన్నికల్లో గెలిపించాలని కోరుతున్నారు. న్యాయం కోసం పేరిట ఆమె యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.
Next Story

