Sun Mar 15 2026 15:00:43 GMT+0530 (India Standard Time)
Ys Sharmila : మేనత్తపై వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్.. ఆమె అందుకే జగన్ కు మద్దతు
వైఎస్ విమలారెడ్డి పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.

తమ మేనత్త వైఎస్ విమలారెడ్డి పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. విమలమ్మ తకు మేనత్త అని, తాము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదని అన్నారు. వివేకా హత్య విషయంలో తాము ఆరోపణలు చేయడం లేదని, సీబీఐ చూపించిన ఆధారాలు మాత్రమే తాము ఎత్తి చూపిస్తుమని తెలిపారు. ఆధారాలు ఉండబట్టే తమకు ఆ విషయం తెలిసిందన్నారు. అందుకే తాము మాట్లాడుతున్నామని షర్మిల తెలిపారు.
ఆధారాలున్నందునే...
ఈ హత్యా రాజకీయాలు ఆగాలని కొట్లాడుతున్నామన్న షర్మిల హంతకులు చట్టసభల్లో వెళ్ళొద్దని పోరాటం చేస్తున్నామని తెలిపారు. విమలమ్మ కొడుకు కి జగన్ వర్క్స్ ఇచ్చారన్నారరు. వాళ్లు ఆర్థికంగా బల పడ్డారని, అందుకే జగన్ వైపు విమలమ్మ మాట్లాడుతున్నారన్నారు. . చనిపోయింది సొంత ఆన్న అని విమలమ్మ తెలుసుకోవాలన్నారు. వివేకా ఎంత చేశారో విమలమ్మ మరిచి పోయిందన్నారు. విమలమ్మ కి వయసు మీద పడిందని, అందులో ఎండా కాలం కావడంతో అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతుందని ఎద్దేవా చేశారు.
Next Story

