Thu Jan 29 2026 13:51:25 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : కడపలో వైఎస్ షర్మిల.. సునీతో భేటీ
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నేడు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నేడు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆమె ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఇడుపుల పాయలో వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత కలిశారు. ఇద్దరూ కలసిి వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం ఆమె కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొననున్నారు.
వరస జిల్లాల పర్యటనలతో...
ఇచ్ఛాపురం నుంచి బయలుదేరిన వైఎస్ షర్మిల వరసగా జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ సమావేశాల్లో పాల్గొంటున్నారు. కార్యకర్తల సమావేశంలో పాల్గొంటూ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీకి కొన్ని స్థానాలు అయినా తీసుకు వచ్చే ప్రయత్నంలో భాగంగా వైఎస్ షర్మిల జిల్లాల పర్యటనలు చేస్తున్నారు.
Next Story

