Fri Dec 05 2025 15:41:46 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : షర్మిల చంద్రబాబును అంత మాటను అనేశారే?
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై విమర్శలు చేశారు

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆమె ఎక్స్ లో పలు రకాల ప్రశ్నలను వేశారు. ఎన్నికల్లో సూపర్ సిక్స్ అంటూ ఆర్భాటం చేసిన బాబు అమలుకొచ్చేసరికి ఆదాయం పెరిగితేనే అంటూ మడతపేచి పెట్టారంటూ ధ్వజమెత్తారు. అప్పులు దొరకవని, ఆదాయం పెంచుకోవాలని, తలసరి ఆదాయం పెరగాలని, మనుషులు మన ఆస్తి అంటూ వింత వింత మాటలు చెప్తున్నారని షర్మిల అన్నారు. ఆడలేక మద్దెల దరువన్నట్లుంది బాబుగారి వ్యవహారం అంటూ ఎద్దేవా చేశారు.
హామీలు అమలు చేయకుండానే...
ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చే ముందు తెలియదా రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని..? సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలంటే తెలియదా ఏటా రూ.2 లక్షల కోట్లు అవసరం ఉందని..? రాష్ట్ర బడ్జెట్ మొత్తం డైవర్ట్ చేసినా ఇంకా నిధుల కొరత ఉంటుందని తెలియదా..? కేంద్రానికి మీరొక్కరే కాదని తెలిసినప్పుడు ఎందుకు మద్దతు ఇచ్చారు ? రాష్ట్రాన్ని సహాయ పడనప్పుడు మోడీతో చెట్టాపట్టాలు దేనికోసం ? అంటూ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ప్రజలు ఓట్లేసి అధికారం ఇస్తే, ఏదో ఉద్ధరిస్తారు అని నమ్మకం పెట్టుకుంటే, హామీలను తుంగలో తొక్కి, విజన్ల పేరుతో , వృద్ధి రేట్ల సాకుతో కాలయాపన తప్ప.. బాబు పనితనం శూన్యం అంటూ షర్మిల ధ్వజమెత్తారు.
Next Story

