Sat Apr 04 2026 19:58:40 GMT+0530 (India Standard Time)
జగన్ కాన్వాయ్ లో కలకలం.. అడ్డంపడిన మహిళ
జగన్ విమానాశ్రయం నుంచి తిరుపతికి వస్తుండగా కాన్వాయ్ కు ఒక మహిళ అడ్డుపడింది. ఆమెను రైల్వేకోడూరుకు చెందిన విజయలక్ష్మి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుపతికి వస్తుండగా కాన్వాయ్ కు ఒక మహిళ అడ్డుపడింది. ఆమెను రైల్వేకోడూరుకు చెందిన విజయలక్ష్మిగా గుర్తించారు. "సీఎం గారూ ప్లీజ్ హెల్ప్" అంటూ ప్లకార్డులు పట్టుకుని ఆ మహిళ సీఎం జగన్ కాన్వాయ్ కు అడ్డువచ్చింది. వెంటనే పోలీసులు ఆమెను పక్కకు తప్పించారు.
రైల్వే కోడూరుకు చెందిన....
కానీ ఆ మహిళలను చూసిన ముఖ్యమంత్రి జగన్ కాన్వాయ్ ను ఆపి ఓఎస్డీ ధనుంజయ్ రెడ్డిని ఆమె వద్దకు పంపారు. సమస్య తెలుసుకుని పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. రైల్లే కోడూరుకు చెందిన ఈ మహిళ ఒక ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది. అయినా అధికారులు ఉద్యోగం ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మెల్యే శ్రీనివాసులుకు చెప్పినా పని జరగలేదు. దీంతో జగన్ కాన్వాయ్ కు అడ్డంపడి సీఎం దృష్టికి తన సమస్యను తీసుకెళ్లాలని ప్రయత్నించింది
Next Story

