Sun Mar 15 2026 07:19:17 GMT+0530 (India Standard Time)
అయ్యన్న అరెస్ట్... ఎందుకంటే?
మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.

మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు ఆయన చిన్న కుమారుడు రాజేష్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇంటి గోడ ప్రహరీ కూల్చివేత కేసులో ఫోర్జరీ పత్రాలను సమర్పించారని అయ్యన్న పాత్రుడిపై ఆరోపణలున్నాయి. ఈ కేసులో మొదటి నిందితుడిగా అయ్యన్నపాత్రుడు, రెండో నిందితుడిగా విజయ్, మూడో నిందితుడిగా రాజేష్ ఉన్నారు.
కుమారుడిని కూడా...
తెల్లవారుజామున నర్సీపట్నంలోని ఆయన ఇంటికి చేరుకున్న సీఐడీ పోలీసులు ఆయనకు నోటీసులు అందచేసి అరెస్ట్ చేశారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి వారిని విశాఖకు తరలించారు. అయ్నన్న పాత్రుడిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిసింది. మరికాసేపట్లో వారిని ఏలూరు కోర్టులో హాజరు పరుస్తారని సమాచారం.
Next Story

