Fri Dec 19 2025 02:21:03 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ సీఎస్‌కు జాతీయ మానవ హక్కుల కమిషన్ సమన్లు
ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ కు జాతీయ మానవ హక్కుల కమిషన్ సమన్లు పంపింది

ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ కు జాతీయ మానవ హక్కుల కమిషన్ సమన్లు పంపింది. వచ్చే నెల 14వ తేదీన తమ ఎదుటహాజరు కావాలని కోరింది. రాష్ట్రంలో బాలికలు తప్పిపోవడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ చీఫ్ సెక్రటరీని నివేదిక కోరింది. అయితే దీనిపై చీఫ్ నుంచి స్పందన రాకపోవడంతో ఈ నోటీసులు పంపినట్లు తెలిసింది.
రెస్పాన్స్ లేకపోవడంతో...
చీఫ్ సెక్రటరీ స్పందించకపోవడాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ గా తీసుకుంది. అడిషనల్ డీజీపీ జూన్ 18న నివేదిక పంపినప్పటికీ చీఫ్ సెక్రటరీ ఎటువంటి నివేదిక పంపకపోవడంపై సీరియస్ అయింది. దీంతో జాతీయ మానవ హక్కుల కమిషన్ చీఫ్ సెక్రటరీకి సమన్లు జారీ చేసింది. దీనిపై చీఫ్ సెక్రటరీ స్పందించాల్సి ఉంది.
Next Story

