Fri Dec 05 2025 14:56:19 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు అల్లూరి జిల్లాకు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించనున్నారు. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆయన అల్లూరి జిల్లా పాడేరులో పర్యటించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పాడేరులో జరిగే ఆదివాసీ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు.
ఆదివాసీ దినోత్సవంలో...
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనులకు ఇస్తున్న ప్రాధాన్యతను ఈ సందర్భంగా చంద్రబాబు తెలియజేయనున్నారు. అరకు కాఫీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తేవడంతో పాటు, ఉపాధి అవకాశాలు కల్పించడం, మారుమూల గిరిజన ప్రాంతాలకు రహదారి సౌకర్యాన్ని మెరుగుపర్చడం వంటి అంశాలను బహిరంగ సభలో ప్రస్తావించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏజెన్సీ ప్రాంతం కావడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అణువణువునా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.
Next Story

