Thu Mar 19 2026 17:12:01 GMT+0530 (India Standard Time)
ఎల్లుండి జగన్ పర్యటన.. అధికారుల ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 21వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 21వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. వన్ టైమ్ సెటిల్ మెంట్ పథకాన్ని ఇక్కడ నుంచి ప్రారంభించనున్నారు. అధికారలు ముఖ్యమంత్రి జగన్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు.
మంచి స్పందన....
పశ్చిమ గోదావరి జిల్లాలో వన్ టైమ్ సెటిల్ మెంట్ పథకాన్ని జగన్ ప్రారంభించనున్నారు. ఈ పథకానికి మంచి స్పందన లభిస్తుందని, ఇప్పటికే లక్షల సంఖ్యలో దరఖాస్తులు అందాయని అధికారులు చెబుతున్నారు. వన్ టైమ్ సెటిల్ మెంట్ పథకాన్ని విపక్షాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో జగన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story

