Thu Mar 26 2026 15:33:55 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : రేపు ఢిల్లీకి జగన్... మోదీతో భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. జలవివాదాలు, ప్రాజెక్టులు, రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై జగన్ మోదీ తో చర్చించనున్నారు. జగన్ చాలా కాలం తర్వాత మోదీతో భేటీ కానున్నారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లి వచ్చినా మోదీని జగన్ కలవలేకపోయారు. ఆయన అపాయింట్ మెంట్ దొరకలేదు. దీంతో వెనుదిరిగి వచ్చారు.
కొత్త ఏడాది.....
అయితే కొత్త ఏడాది కావడంతో మోదీ అపాయింట్ మెంట్ కోసం జగన్ కార్యాలయం కోరింది. దీనికి ప్రధాని కార్యాలయం సానుకూలంగా స్పందించడంతో రేపు జగన్ ఢిల్లీకి బయలు దేరి వెళుతున్నారు. రాష్ట్ర అంశాలను ప్రస్తావించడంతో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపనున్నారు. గత నెల 28న రాష్ట్ర బీజేపీ విజయవాడలో సమావేశం పెట్టి వైసీీపీ పై విమర్శలు చేసింది. కేంద్ర మంత్రి జవదేకర్ సయితం బెయిల్ పై ఉన్నవాళ్లు జైలుకెళతారన్న కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో జగన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story

