Sun Mar 22 2026 04:56:47 GMT+0530 (India Standard Time)
జగన్ విశాఖ పర్యటన వాయిదా... మళ్లీ ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ పర్యటన వాయిదా పడింది. రేపు విశాఖలో జగన్ పర్యటించాల్సి ఉంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ పర్యటన వాయిదా పడింది. రేపు విశాఖలో జగన్ పర్యటించాల్సి ఉంది. భారీ వర్షాల కారణంగా జగన్ పర్యటన వాయిదా పడినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ నెల 13వ తేదీన విశాఖలో జగన్ వాహనమిత్ర లబ్దిదారులకు నిధులను అందచేయాల్సి ఉంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
భారీ వర్షాలతో...
అయితే గత నాలుగు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ముఖ్యమంత్రి జగన్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. అయితే ఈ నెల 15వ తేదీన జగన్ విశాఖలో పర్యటిస్తారని సీఎంవో తెలిపింది. పూర్తి స్థాయి షెడ్యూల్ రేపు విడుదల చేయనుంది.
Next Story

