Tue Mar 17 2026 00:33:42 GMT+0530 (India Standard Time)
జగన్ విమానంలో సాంకేతిక లోపం
ముఖ్యమంత్రి జగన్ విశాఖ పర్యటన ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది.

ముఖ్యమంత్రి జగన్ విశాఖ పర్యటన ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. గన్నవరం ఎయిర్‌పోర్టులోనే ముఖ్యమంత్రి జగన్ అరగంట సేపు వేచి చూశారు. సాంకేతిక లోపంతో జగన్ ప్రయాణించాల్సిన ఫ్లైట్ నిలిచిపోయింది. చాలా సేపు వెయిట్ చేసిన జగన్ చివరకు విమానం మరమ్మతులు చేయడంతో జగన్ విశాఖకు బయలుదేరి వెళ్లారు. రాత్రికి జీ 20 ప్రతినిధులతో ముఖ్యమంత్రి జగన్ భేటీ కానున్నారు.
బయలుదేరిన జగన్....
ముఖ్యమంత్రి జగన్ గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విశాఖకు బయలుదేరారు. ఈరోజు విశాఖలో జీ 20 సన్నాహక సదస్సుకు హాజరైన ప్రతినిధులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిన్నర్ కార్యక్రమంలో జగన్ పాల్గొనాల్సి ఉంది. అయితే విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పర్యటన రద్దయినట్లేనని తొలుత భావించినా చివరకు నిపుణులు మరమ్మతులు చేసి ఫ్లైట్ రెడీ చేయడంతో ఆయన విశాఖకుబయలుదేరి వెళ్లారు.
Next Story

