Thu Mar 19 2026 18:43:58 GMT+0530 (India Standard Time)
జగన్ పర్యటనలో అపశృతి
రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది

రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. రాజమండ్రిలో క్వారీ మార్కెట్ లో ఒక మహిళ కాలిపై నుంచి ఆర్టీసీ బస్సు పోవడంతో ఆమెకు గాయాలయ్యాయి. జగన్ సభకు ఆ మహిళ వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
గాయపడిన మహిళను...
గాయపడిన మహిళను వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం ఏమీ లేకున్నా, కాలికి తీవ్ర గాయం కావడంతో కొన్ని రోజుల పాటు మహిళ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మహిళ తొందరపడి బస్సును చూసుకోకుండా రావడంవల్లనే ఈ దుర్ఘటన జరిగిందని చెబుతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

