Sun Mar 15 2026 01:18:41 GMT+0530 (India Standard Time)
Ys Jagan : పులివెందులలో వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన కొనసాగుతుంది

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన కొనసాగుతుంది. ఉదయం కడప జిల్లాకు చేరుకున్న జగన్ కు అధికారులు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. పులివెందులకు చేరుకున్న జగన్ అక్కడ ఏర్పాటు చేేసిన బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్‌ను ప్రారంభించారు. దీని వల్ల రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ బనానా ప్యాక్ హౌస్ లో అరటి పండ్ల నాణ్యతను చెక్ చేసి ఎగుమతి చేసేందుకు అవకాశం కల్పిస్తారని అధికారులు చెప్పారు.
మెడికల్ కళాశాలను...
అనంతరం జగన్ పులివెందులలోని వైఎస్ఆర్ మెడికల్ కాలేజీతో పాటు ఆసుపత్రిని కూడా ప్రారంభించారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. పులివెందుల, ఇడుపులపాయలో మొత్తం వెయ్యి కోట్ల రూపాయల అభివృద్ధి పనులను నేడు జగన్ ప్రారంభించనున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లను అధికారులు చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలో కలియతిరుగుతూ అక్కడ ఏర్పాటు చేసిన సౌకర్యాలను జగన్ అడిగి తెలుసుకున్నారు. సాయంత్రానికి జగన్ తాడేపల్లికి చేరుకోనున్నారు.
Next Story

