Thu Mar 19 2026 14:00:28 GMT+0530 (India Standard Time)
నేటితో ముగియనున్న జగన్ పర్యటన
కడప జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన నేటితో ముగియనుంది.

కడప జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన నేటితో ముగియనుంది. మరికొద్ది సేపట్లో ఆయన కడప నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. ఈనెల 1వ తేదీన కడప జిల్లాకు వెళ్లిన జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేల్పులలోని సచివాలయం సముదాయాన్ని ప్రారంభించారు.
అభివృద్ధి కార్యక్రమాల్లో....
అనంతరం సెప్టంబరు 2వ తేదీన ఇడుపుల పాయలో వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా అక్కడ జరిగిన ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈరోజు 9 గంటలకు కడప నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. జగన్ మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించినట్లయింది.
Next Story

