Thu Mar 19 2026 08:19:47 GMT+0530 (India Standard Time)
సీఎం పర్యటనలు అన్ని వాయిదా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కార్యక్రమాలన్నీ వాయిదా పడుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కార్యక్రమాలన్నీ వాయిదా పడుతున్నాయి. అనుకోకుండా మధ్యలో వచ్చిన కార్యక్రమాలతో జగన్ తన కార్యక్రమాలను వాయిదా వేసుకుంటున్నారు. నిజానికి రేపు నరసరావుపేటలో వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో జగన్ పాల్గొనాల్సి ఉంది. కానీ ఈ కార్యక్రమాన్ని ఈ నెల 7వ తేదీకి వాయిదా వేశారు. ఈరోజు జగన్ ఢిల్లీ వెళ్లాల్సి ఉండటంతో వాలంటీర్ల సన్మాన కార్యక్రమాన్ని ఎల్లుండికి వాయిదా వేశారు.
మంత్రి వర్గ విస్తరణ.....
ఇక 7వ తేదీన మంత్రి వర్గ సమావేశం జరగాల్సి ఉంది. ఉదయం 11 గంటలకు జరగాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని ఆరోజు సాయంత్రానికి వాయిదా వేశారు. ఈనెల 11వ తేదీన మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ముందుగా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకోనున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత జగన్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసే అవకాశముంది.
Next Story

