Tue Jun 06 2023 12:11:03 GMT+0000 (Coordinated Universal Time)
ముగిసిన భేటీ : 45 నిమిషాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ ముగిసింది. దాదాపు నలభై ఐదు నిమిషాలు ఈ భేటీ కొనసాగింది

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ ముగిసింది. దాదాపు నలభై ఐదు నిమిషాలు ఈ భేటీ కొనసాగింది. రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలను ప్రధాని మోదీ దృష్టికి జగన్ తీసుకెళ్లినట్లు తెలిసింది. పోలవరం ప్రాజెక్టు నిధులతో పాటు పెండింగ్ అంశాలపై జగన్ ప్రధాని మోదీకి వినతిపత్రం ఇచ్చారని చెబుతున్నారు.
వివిధ అంశాలపై...
పార్లమెంటు ఆవరణలో ప్రధాని మోదీతో జగన్ భేటీ జరిగింది. ఈరోజు ఉదయం పదిన్నర ప్రాంతంలో పార్లమెంటుకు చేరుకున్న జగన్ ప్రధాని కోసం కొంత వెయిట్ చేశారు. పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడటంతో ప్రధాని తన కార్యాలయానికి వచ్చిన వెంటనే ఆయనను కలుసుకుని రాష్ట్రాభివృద్ధి గురించి చర్చించారని చెబుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ అంశాలను పరిష్కరించాలని కోరారు.
Next Story