Tue Mar 17 2026 04:28:49 GMT+0530 (India Standard Time)
45 నిమిషాల పాటు ప్రధానితో?
ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ ముగిసింది. దాదాపు 45 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది

ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ ముగిసింది. 12.30 గంటలకు ప్రధాని నివాసానికి చేరకున్న జగన్ 1.20 గంటలకు బయటకు వచ్చారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రాభివృద్ధితో పాటు పలు అంశాలపై జగన్ మోదీతో చర్చించనున్నారు.
అనేక అంశాలపై...
పోలవరం ప్రాజెక్టు, విభజన హామీల అమలు, పెండింగ్ ప్రాజెక్టులపై జగన్ మోదీతో చర్చించినట్లు సమాచారం. దీంతో పాటుకొన్ని రాజకీయ అంశాలపై కూడా జగన్ చర్చించినట్లు తెలిసింది. రాష్ట్ర సమస్యలపై ఆయన ప్రధానికి వినతి పత్రం సమర్పించినట్లు తెలుస్తోంది. అనంతరం ఆయన మధ్యాహ్నం రెండు గంటలు అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తో జగన్ సమావేశం కానున్నారు. రాత్రి పది గంటలకు హోం మంత్రి అమిత్ షాను జగన్ కలవనున్నారు.
Next Story

