Tue Mar 31 2026 04:35:57 GMT+0530 (India Standard Time)
కొత్త గవర్నర్ వచ్చారు.. జగన్కు జింతాక్.. జింతాక్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు మండి పడ్డారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు మండి పడ్డారు. చంద్రబాబును ముసిలాయన అన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొబ్బరికాయ కొట్టడానికి కూడా వంగలేకపోయారని అయ్యన్న పాత్రుడు ఎద్దేవా చేశారు. పూజారులే రాయిని ఎత్తిపట్టుకోవాల్సి వచ్చిందని సెటైర్ వేశారు. తమ పార్టీ అధినేత చెంగు చెంగుమని గెంతుతూ వెళుతున్నారని, ఆ వయసులో రెట్టించిన ఉత్సాహంతో అన్ని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని అయ్యన్న అన్నారు.
కొబ్బరికాయ కొట్టలేని...
ముఖ్యమంత్రి వయసులో ఉండి కూడా తాడేపల్లికి మాత్రమే పరిమితమయ్యారన్నారు. కోడి కత్తి కేసు ఏమయిందని, ఎందుకు సాక్ష్యం చెప్పడానికి న్యాయస్థానంలో హాజరు కావడం లేదని ప్రశ్నించారు. కడప స్టీల్ ప్లాంట్ కు ఇప్పటికి నాలుగు సార్లు శంకుస్థాపనలు చేశారని, ఒకసారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఇంకోసారి చంద్రబాబు చేస్తే దానిని బ్రేక్ చేస్తూ జగన్ రెండు సార్లు శంకుస్థాపనలు చేశారంటూ సెటైర్ వేశారు. ప్రజలను మభ్యపెడుతూ కాలం నెట్టకొస్తున్నారని అన్నారు. కొత్త గవర్నర్ వచ్చారని, ఇక జింతాక్.. జింతాక్ అంటూ అయ్యన్న జగన్ ను ఎద్దేవా చేశారు. ఎన్నికలు ఎంతో దూరం లేవని, ఈసారి ప్రజలు అధికారం నుంచి బయటకు తరిమేయడం ఖాయమని అయ్యన్న జోస్యం చెప్పారు.
Next Story

