Sun Mar 15 2026 10:54:40 GMT+0530 (India Standard Time)
Ys Jagan : విజయవాడ చేరుకున్న జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటన ముగిసింది. తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో కలసి విజయవాడ చేరుకున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటన ముగిసింది. నిన్న రాత్రి ఆయన లండన్ నుంచి బయల్దేరి ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరకున్నారు. అక్కడి నుంచి నేరుగా తాడేపల్లిలోని నివాసానికి వెళ్తారు. జగన్ కు పెద్దయెత్తున స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు గన్నవరం ఎయిర్పోర్టుకు తరలివచ్చారు.
పార్టీ నేతలతో...
ఈరోజు మధ్యాహ్నం పార్టీ నేతలతో జగన్ సమావేశమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కౌంటింగ్ ఏర్పాట్లు, పోస్టల్ బ్యాలెట్ వివాదం తదితర అంశాలపై నేతలతో చర్చించనున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయిన తర్వాత జగన్ ఈనెల 17న విదేశీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. లండన్, స్టిట్జర్లాండ్ లో ఆయన పర్యటన పదిహేను రోజుల పాటు సాగింది.
Next Story

