Sun Mar 15 2026 05:03:00 GMT+0530 (India Standard Time)
జగన్ ప్రయాణిస్తున్న విమానం ఎమెర్జెన్సీ ల్యాండింగ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. గన్నవరం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తడంతో తిరిగి గన్న వరం విమానాశ్రయంలో అత్యవసర ల్యాడింగ్ చేశారు. సాంకేతిక లోపం ఏంటన్నది కారణాలు తెలియరాకున్న విమానం తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోవడంతో అధికారులు, వైసీపీ నేతలు ఆందోళన చెందారు. టేకాఫ్ అయిన కొంత సేపటికే సాంకేతిక లోపం తలెత్తిందని చెబుతున్నారు. ప్రస్తుతం జగన్ ఇంకా గన్నవరం ఎయిర్‌పోర్టులోనే ఉన్నారు.
సాంకేతిక లోపంతో...
ముఖ్యమంత్రి జగన్ ఈరోజు ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. అక్కడ రేపటి నుంచి రెండు రోజుల పాటు జరిగే సమ్మిట్ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ కర్టెన్‌రైజర్ కార్యక్రమంలో ఆయన పాల్గొనాల్సి ఉంది. రాత్రికి ఢిల్లీలో బస చేసి రేపు ఉదయం జరిగే విదేశీ దౌత్యవేత్తలతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొనాల్సి ఉంది. ప్రత్యేక విమానంలో వెళ్లిన జగన్ తిరిగి గన్నవరం చేరుకున్నారు. మరొక విమానంలో జగన్ ఢిల్లీకి వెళతారా? లేదా? అన్నది అధికారికంగా తెలియాల్సి ఉంది.
Next Story

