Thu Mar 19 2026 06:42:45 GMT+0530 (India Standard Time)
ముగిసిన జగన్ ఢిల్లీ టూర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ ముగిసింది. జగన్ ఢిల్లీ నుంచి విజయవాడ బయలుదేరారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ ముగిసింది. జగన్ ఢిల్లీ నుంచి విజయవాడ బయలుదేరారు. నిన్న రాత్రి అమిత్ షాతో భేటీ అయిన జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. అమిత్ షాతో దాదాపు నలభై ఐదు నిమిషాలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అభివృద్ధితో పాటు పలు రాజకీయ అంశాలపైన కూడా జగన్ చర్చించినట్లు తెలుస్తోంది
కేంద్ర మంత్రులను...
అయితే ఈరోజు మరికొందరు కేంద్ర మంత్రులను కలవాలనుకున్నారు. కానీ కేంద్ర మంత్రులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఆయన తిరిగి విజయవాడకు ప్రయాణమయ్యారు. శ్రీరామనవమి కావడంతో కేంద్ర మంత్రులు తమ నియోజకవర్గాలకు వెళ్లడంతోనే ఆయన తిరుగు ప్రయాణమయ్యారని తెలుస్తుంది.
Next Story

