Fri Mar 20 2026 23:22:22 GMT+0530 (India Standard Time)
Breaking : ఢిల్లీకి జగన్... ఏం జరుగుతుందంటే?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 6వ తేదీన ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 6వ తేదీన ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. చంద్రబాబు స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసులో అరెస్టయిన తర్వాత తొలిసారి జగన్ ఢిల్లీకి వెళుతుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
పొత్తు ఖరారయిన....
ఒకవైపు జనసేన, టీడీపీ పొత్తు ఖరారయిన నేపథ్యంలో జగన్ హస్తిన యాత్ర ఎందుకోసమో? అన్న చర్చ జరుగుతుంది. పార్టీ వర్గాలు మాత్రం రాష్ట్ర అభివృ ద్ధి కోసమేనని చెబుతున్నా, ఈ పర్యటన మాత్రం పూర్తిగా రాజకీయ పర్యటన అనే భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా వెళతానని ఇప్పటికే ప్రకటించిన జగన్ ప్రధాని మోదీ, అమిత్ షాల నుంచి ఏ రకమైన హామీలను సాధించుకువస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story

