Tue Mar 17 2026 03:00:25 GMT+0530 (India Standard Time)
Ys Jagan : రేపు ఇంద్రకీలాద్రికి జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు విజయవాడలో పర్యటించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు విజయవాడలో పర్యటించనున్నారు. దుర్గగుడిని సందర్శించనున్నారు. ఇంద్రకీలాద్రిపై జరగనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఇంద్రకీలాద్రిని అభివృద్ధి చేయడానికి పెద్దయెత్తున ప్రభుత్వం నిధులు కేటాయించిన నేపథ్యంలో జగన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
నిధులు కేటాయించిన ...
ఇంద్రకీలాద్రిపై భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని చాలా రోజుల నుంచి డిమాండ్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో జగన్ రేపు ఇంద్రకీలాద్రిపై పర్యటించి అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. జగన్ రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ నేతలు కూడా అధిక సంఖ్యలో హాజరు కానున్నారు.
Next Story

