Tue Mar 31 2026 13:00:53 GMT+0530 (India Standard Time)
అనకాపల్లి జిల్లాలో జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి జగన్ బయలుదేరారు. మరికాసేపట్లో నర్సీపట్నం చేరుకుంటారు. నర్సీపట్నం నియోజకవర్గంలో వెయ్యి కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. అలాగే మాకవరంలో సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి, మెడికల్ కళాశాల కోసం భూమి పూజ చేయనున్నారు. 500 కోట్ల రూపాయల వ్యయంతో వీటిని నిర్మించనున్నారు.
ఎత్తిపోతల పథకానికి...
తాండవ ఎత్తిపోతల పథకానికి కూడా ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఏలేరు జలాశయం నుంచి తాండవ రిజర్వాయర్ కు మళ్లిస్తే దాదాపు అరవై వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. 450 రూపాయల కోట్ల రూపాయలను ఇందుకోసం ఖర్చు చేయనున్నారు. అనంతరం నర్సీపట్నంలోని జోగునాథునిపాలెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Next Story

