Thu Dec 18 2025 23:07:56 GMT+0000 (Coordinated Universal Time)
రాజ్భవన్లో జగన్
గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిశారు

గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిశారు. రాజ్ భవన్ కు వచ్చిన జగన్ గవర్నర్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇది కేవలం మర్యాదపూర్వకంగా కలవడమేనని ముఖ్యమంత్రి కార్యాలయం వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సజావుగా జరగడమే కాకుండా, ఆయన ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించేందుకు వచ్చినందుకు జగన్ ధన్యవాదాలు తెలిపారు.
తాజా రాజకీయ పరిణామాలపై...
దీంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై కూడా ఇరువురి మధ్య చర్చజరిగినట్లు తెలుస్తోంది. చంద్రబాబుపై అవినీతి కేసుల వ్యవహారం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ వంటి విషయాలను కూడా జగన్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు వివరించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే మంత్రి వర్గ విస్తరణపై ఎలాంటి చర్చ జరగలేదని, అది మీడియాలో జరుగుతున్న ప్రచారమేనని కొందరు పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు.
Next Story

