Thu Mar 19 2026 14:01:51 GMT+0530 (India Standard Time)
నేడు వైఎస్సార్ జిల్లాకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు ఆయన కడపలోనే ఉంటారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు ఆయన కడపలోనే ఉంటారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు బయలుదేరి అమీన్ పీర్ దర్గాకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. కమలాపురంనియోజకవర్గంలోని పలు 900 కోట్ల రూపాయలతో కూడిన అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేయనున్నారు. కమలాపురంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
మూడు వివాహ వేడుకల్లో...
మూడు వివాహవేడుకలకు ఆయన ఈరోజు హాజరు కానున్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ సలహాదారు రాజోలి వీరారెడ్డి నివాసానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం ఏపీ ఎస్ఆర్టీసీ ఛైర్మన్ మల్లికార్జునరెడ్డి నివాసానికి వెళ్లి అక్కడ కూడా నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. అనంతరం కడప శివారోలోని మాధవి కన్వెన్షన్ కు చేరుకుని మైనార్టీ నాయకుడు అప్జల్ ఖాన్ కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొంటారు. రాత్రికి ఇడుపులపాయలోనే సీఎం జగన్ బస చేస్తారు.
Next Story

