Sun Mar 08 2026 00:49:08 GMT+0530 (India Standard Time)
రేపు నరసాపురానికి జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. నరసాపురంలో ఆయన పర్యటిస్తారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని నరసాపురంలో ఆయన పర్యటిస్తారు. ఉదయం పది గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.50 గంటలకు నరసాపురానికి చేరుకుంటారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు.
ప్రారంభోత్సవాలు...
ప్రారంభోత్సవ కార్యక్రమాల అనంతరం బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.15 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు. జగన్ పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ నేతలు కూడా జగన్ పర్యటన ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు.
Next Story

