Thu Mar 19 2026 17:13:25 GMT+0530 (India Standard Time)
నేడు పశ్చిమ గోదావరి జిల్లాకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని జగన్ ప్రారంభించనున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, పేదల కు సొంత ఇంటికల నిజం చేస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ పథకాన్ని పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జగన్ ప్రారంభించనున్నారు.
బహిరంగ సభలో...
అనంతరం బహిరంగ సభలో కూడా జగన్ ప్రసంగిస్తారు. ఈ సభలో కొందరు లబ్దిదారులకు జగన్ రిజిస్ట్రేషన్ పత్రాలను అందచేయనున్నారు. ఓటీఎస్ పథకాన్ని ప్రారంభించిన వెంటనే మంచి స్పందన లభించిందని అధికారులు చెబుతున్నారు. స్వచ్ఛందంగానే ఓటీఎస్ కు దరఖాస్తు చేసుకోవచ్చని, బలవంతం ఏమీ లేదని ప్రభుత్వం చెబుతుంది.
Next Story

